శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (12:20 IST)

ఓ పసిపాపకు తల్లిగా నయనతార.. వినాయక చవితి కానుకగా 'మయూరి' రిలీజ్...

టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార నయనతార నటిస్తున్న తాజా చిత్రం 'మయూరి'. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 17న విడుదలవుతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చంద్రకళ, ఉత్తమ విలన్, జ్యోతిలక్ష్మీ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన సి. కళ్యాణ్ నిర్మించారు. 
 
ఈ సందర్భంగా సికె ఎంటర్-టైన్-మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. తమిళంలో ‘మాయ’ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మయూరి’గా రిలీజ్ చేస్తున్నామన్నారు. విభిన్న కథాంశంతో ప్రేక్షకులను థ్రిల్ చేసే ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు. 
 
థ్రిల్లర్ మూవీ అయినందున విజువల్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ చాలా కేర్ తీసుకుని హై స్టాండర్డ్స్‌లో చేశామన్నారు. ఓ పసిపాప తల్లిగా నయనతార ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేశారన్నారు. నటిగా నయనతారకు ఈ చిత్రం మంచి పేరు తెస్తుందన్నారు. ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఎంటర్-టైన్ చేస్తుందన్నారు. 
 
చిత్ర విశేషాలను గురించిన నయనతార మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ తాను చేసిన క్యారెక్టర్లకు పూర్తి భిన్నంగా ఉండే క్యారెక్టర్ ఇది అన్నారు. వంద శాతం పెర్ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు.

ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ శరవణన్ ఎక్స్‌లెంట్‌గా తీశారన్నారు. కాగా ఇందులో ఆది, అంజాద్-ఖాన్, మైమ్ గోపి, లక్ష్మీప్రియ, చంద్రమౌళి, రోబో శంకర్, శరత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.