కండోమ్ ఎలా వుంటుందో చూద్దామని ఒకసారి కొన్నాను.. సందీప్ కిషన్

Last Updated: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (12:10 IST)
సందీప్ కిషన్, తమన్నా, నవదీప్ కాంబోలో నెక్ట్స్ ఏంటి అనే సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సందీప్, నవదీప్, తమన్నాలు దగ్గుబాటి రానా వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న నెం.1 యారీ షోకు హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో వీడియా తాజాగా విడుదలైంది. ఈ వీడియోలో సందీప్, రానా, తమన్నా, నవదీప్‌ల మధ్య బోల్డ్ టాక్ నడిచింది.
 
ఈ వీడియోలో తమన్నా రానాను మీరు సింగిలేనా అని ప్రశ్నించింది. అందుకు రానా అవునని సమాధానమిచ్చాడు. పక్కనే వున్న నవదీప్ ఎప్పుడూ సింగిలే అని పంచ్ వేశాడు. నవదీప్ అండర్ వేర్ బ్రాండ్ ఏమిటి.. అని సందీప్‌‌ని రానా ప్రశ్నించగా, సందీప్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి అందరూ నవ్వుకున్నారు. మధ్యలో కండోమ్ టాపిక్ కూడా వచ్చింది. 
 
కండోమ్ ఎలా వుంటుందో చూద్దామని ఒక్కసారి కొన్నాను అని సందీప్ చెప్తుండగా, నవదీప్ ఇంకానయం ఎలా వాడతారో చూద్దామనుకోలేదు అంటూ పంచ్ వేశాడు. ఇంకా తమన్నా రానాను పొగిడేయడం.. నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదనే డైలాగ్ చెప్పడం బాగుంది. ఇలా ప్రోమో మొత్తం బోల్డ్ కామెంట్స్, నవ్వులతో ఈ వీడియో కనిపించింది. ఈ ప్రోగ్రామ్ ఆదివారం ప్రసారం కానుంది. ప్రస్తుతం ప్రోమోను ఓ లుక్కేయండి.దీనిపై మరింత చదవండి :