శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (17:30 IST)

"లవ్‌ స్టోరి" సారంగ దరియా ఖాతాలో కొత్త రికార్డ్.. 1 మిలియన్ లైక్స్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోంది ఈ 'లవ్‌ స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకుడు. నారాయణదాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలోని "సారంగ దరియా" గీతం సరికొత్త రికార్డు సృష్టించింది. 'లవ్‌ స్టోరి' చిత్రంలోని ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన అనతి కాలంలోనే 1 మిలియన్‌ లైక్స్‌ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా నిలిచింది. 
 
ఫిబ్రవరి 28న కథానాయిక సమంత ఈ పాటని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 90 మిలియన్లకి పైగా వీక్షణలు సొంతం చేసుకుని, శ్రోతల్లో జానపదానికి ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియజేస్తోంది ఈ గీతం. పాటకు తగినట్టు సాయి పల్లవి చేసిన నృత్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించగా పవన్‌ సి.హెచ్‌. స్వరాలు సమకూర్చారు. మంగ్లీ ఆలపించారు.