శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (18:55 IST)

తెలుగు బిగ్ బాస్ 5_ ఈ వారం క్యాప్టెన్ 'సిరి'? కెప్టెన్సీ టాస్క్ వుండబోదు..

Siri
తెలుగు బిగ్ బాస్ 5 రెండో రోజు గడిచిపోయింది. బిగ్ బాస్ ఇంట్లో ప్రతీ క్షణం ఓ పరీక్షే. టాస్కులు బాగా ఆడితే ఒక రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆడకపోతే మరొక రకమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి.

అయితే తాజాగా పవర్ రూం కోసం జరుగుతున్న పోరులో అందరూ కూడా గోతికాడి నక్కలా ఎదురుచూస్తున్నారు. కొందరు కంటెస్టెంట్లు అయితే నిద్ర కూడా పోకుండా మేల్కొన్నారు.

ఇప్పటి వరకు విశ్వ, మానస్‌లు పవర్ హౌస్‌లోకి వెళ్లారు. వారికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను పూర్తి చేశారు. అయితే మూడో సైరన్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తూ వచ్చారు.
 
ఇందులో భాగంగా విశ్వ తన పవర్‌ను ఉపయోగించిన రవి, ప్రియల బట్టలను బిగ్ బాస్ ఇచ్చేశారు. దాంట్లో భాగంగానే రవి ఆడవారి బట్టలు, ప్రియ మగవారి బట్టలను వేసుకుని తిరిగారు.

మానస్ అయితే కాజల్‌ను ఎంచుకుని నిద్రలేని రాత్రి గడిపేలా చేశారు. ఇక మూడో బజర్ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ బజర్ నేడు మోగేలా ఉంది. దాన్ని హమీద కొట్టేలా ఉంది. పవర్ రూంలోకి ఎంట్రీ ఇచ్చేలా ఉంది.
 
అలా పవర్ రూంలోకి ఎంట్రీ ఇచ్చిన హమీదకు పెద్ద షాకే తగలనున్నట్టు కనిపిస్తోంది. ఆమె ఎంచుకునే ఓ కంటెస్టెంట్.. బిగ్ బాస్ ఇంట్లో ఎప్పటికీ కెప్టెన్ అవ్వలేరు. ప్రియ పేరును హమీద సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

దీంతో బిగ్ బాస్ ఇంట్లో ప్రియ ఇక ఎప్పటికీ కెప్టెన్ అవ్వలేరు. అయితే బిగ్ బాస్ ఇంట్లో మొదటి కెప్టెన్‌గా సిరి అయినట్టు లీకులు అందుతున్నాయి. నేడు కెప్టెన్సీ టాస్క్ ఉండబోతోందని, అందులో సిరి గెలవబోతోందని తెలుస్తోంది.