మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (20:13 IST)

నిర్మాతలకు కాసుల వర్షం... రేటు పెంచేసిన 'గద్దలకొండ గణేశ్'

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్. సినీ కెరీర్‌పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్నారు. వరుస హిట్స్‌తో దూసుకెళుతున్నారు. పైగా, నిర్మాతల పాలిట కనకవర్షం కురిపించే హీరోగా మారిపోయారు. దీంతో వరుణ్ తేజ్ నటించే చిత్రాలు కనకవర్షం కురిపిస్తున్నాడు. దీంతో తన రేటును కూడా ఒక్కసారి పెంచేసుకున్నాడు. 
 
నిజానికి తనతోపాటు సినీ రంగానికి పరిచయమైన హీరోల కెరీర్ ఎత్తుపల్లాలుగా సాగుతోంది. ఒక హిట్ కొడితే రెండు ఫ్లాపులతో సాగిపోతోంది. కానీ, వరుణ్ తేజ్ మాత్రం భిన్నకథలను ఎంచుకుంటూ తన మార్కెట్‌ను పెంచుకుంటూ సాగిపోతున్నాడు. 
 
తనకంటే ముందొచ్చిన యువ హీరోలను దాటి మీడియం రేంజ్ హీరో స్టేజ్‌కు చేరుకున్న వరుణ్‌... టాప్ లీగ్‌లోకి వెళ్లాలని ఆశపడుతున్నాడు. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన 'గద్దల కొండ గణేష్' సినిమా కూడా సూపర్‌ హిట్‌ కావడంతో వరణ్‌ మార్కెట్‌ బాగా పెరిగింది. 
 
వరుణ్ తేజ్ తాజా చిత్రం 'గద్దలకొండ గణేష్'. ఈ చిత్రానికి ముందు వరుణ్ తేజ్ పారితోషికం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు తీసుకునేవాడు. కానీ, ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టేసింది. ఫలితంగా తన రేంజ్‌ను ఒక్కసారిగా పెంచేసుకున్నాడు. ఇపుడు రూ.7 నుంచి రూ.8 కోట్ల మేరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. 
 
వరుణ్ ఖాతాలో వరుసగా తొలిప్రేమ, ఎఫ్-2, గద్దగకొండ గణేష్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి. దీంతో వరుణ్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. వరుణ్ నటించిన అన్ని సినిమాలు లాభాలు తీసుకురావడంతో నిర్మాతలు కూడా రెమ్యునరేషన్ ఎక్కువైనా వరుణ్‌తో సినిమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. 
 
కాగా, ప్రస్తుతం వరుణ్‌.. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కెరీర్‌లో తొలిసారిగా వరుణ్ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి కొత్త దర్శకుడైనా అన్ని కమర్షియల్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారట. మొత్తంమీద ఈ మెగా ఫ్యామిలీ హీరో కూడా టాప్ గేర్‌లో వెళుతున్నారని చెప్పొచ్చు.