గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (11:58 IST)

యస్... మెగాస్టార్ 'బాహుబలి' చూసారు... వండర్‌ఫుల్ అన్నారు...

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి కంక్లూజన్ చిత్రం పైన పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని నేరుగా థియేటర్ కు వెళ్లి వీక్షించారు. ఆ తర్వాత చిత్రంపై స్పందించారు. రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యధ్బుతంగా త

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి కంక్లూజన్ చిత్రం పైన పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని నేరుగా థియేటర్ కు వెళ్లి వీక్షించారు. ఆ తర్వాత చిత్రంపై స్పందించారు.
 
రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యధ్బుతంగా తెరకెక్కించారు. ఇదో వండర్. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచేసాడు. ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఈ చిత్రానికి కథను అందించిన విజయేంద్రప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. 
 
ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ ఇంకా ఇతర చిత్ర బృందానికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.