శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2019 (21:18 IST)

మెగా అభిమాని పీతల గోవింద్ అకాల మరణం... గోవింద కుటుంబాన్ని ఆదుకుంటానని మెగాస్టార్ భరోసా

మెగాస్టార్ చిరంజీవి గారిని గుండెల్లో పెట్టుకొని ఆరాధించే కోట్లాది మంది అభిమానుల్లో పీతల గోవిందు కూడా ఒకరు. ఆయన హఠాత్తుగా గుండెపోటుతో గురువారం అకాల మృత్యువాత పడ్డారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే శ్రీ చిరంజీవి గారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. 
పీతల గోవింద్ ఆత్మకు శాంతి కలగాలని,  ఈ విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరితగతిన బయటపడాలని చిరంజీవిగారు అన్నారు.
 
ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇన్నేళ్లు శ్రీ గోవింద్ గారు పంచిన కొండంత అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ... ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఓ అభిమాని పట్ల శ్రీ చిరంజీవి గారు చూపిస్తున్న ఆదరణకు అభిమానలందరి పక్షాన అఖిల భారత చిరంజీవి యువత కృతజ్ఞతలు చెప్పుతోంది.
 
స్వార్థరహితంగా అభిమానించి... ప్రాణం పోయేవరకూ ఆ అభిమానం శాశ్వతమని చెప్పకనే చెప్పిన పీతల గోవింద్ అంత త్వరగా తిరిగిరాలేని దూరతీరాలకు తరలిపోవడం నిజంగా శోచనీయం. పీతల గోవింద్ మరణాన్ని అఖిల భారత చిరంజీవి యువత జీర్ణించుకోలేకపోతోంది. వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి  మెగా అభిమానులు అందరూ ప్రార్థిస్తున్నారు.
 
 మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు పండుగంటే  అభిమానులందరికీ దసరా,  దీపావళి,  క్రిస్మస్, సంక్రాంతి,  రంజాన్ పర్వదినాలన్ని మూకుమ్మడిగా విచ్చేసినంత ఆనందంతో పులకించిపోతుంటారు. శ్రీ పీతల గోవింద్ విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవి చిత్రాల్లోని పాటలకు డాన్స్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. 
 
అభిమానాన్ని వెలపెట్టి ఎవ్వరు కొనలేరు. ప్రేమాభిమానాల్ని ఎవ్వరు దొంగిలించలేరు. 
శ్రీ పీతల గోవింద్ మెగా అభిమానానికి అవధులు లేనేలేవు. శ్రీ గోవింద్ భార్య శ్రీమతి అమూల్య, కూతురు ఇంటర్ చదువుతున్న పీతల పూర్విక రాఘవ శ్రీ, తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమారుడు పీతల ధోని సురాజ్ యాదవ్‌లకు మెగాభిమానుల తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. మెగాభిమానులందరూ ముందుకు వచ్చి పీతల గోవింద్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇతోధికంగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. 
 
శ్రీ పీతల గోవింద్ కుటుంబ సభ్యులు అందరికీ మరొకసారి మెగా అభిమానులు అందరూ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఓం స్వామియే శరణం అయ్యప్ప !
 
-- అఖిల భారత చిరంజీవి యువత.