మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 19 నవంబరు 2020 (21:04 IST)

మెగాస్టార్ చిరుతో సమంత అక్కినేని సామ్ జామ్ ఆహా.. ఓహో...

ఆహా కోసం ప్రసారం అవుతున్న సమంతా అక్కినేని టాక్ షో సామ్ జామ్ క్రేజ్ పెరుగుతోంది. ఈ షో రాబోయే ఎపిసోడ్ కోసం నటుడు చిరంజీవి గురువారం ప్రత్యేక షోను చిత్రీకరించారు. చిరంజీవి, సమంతా ఇద్దరు కలిసి చేసిన షూట్ చిత్రాలు వైరల్ అయ్యాయి. కాగా ఈ షోలో మొదటి ప్రముఖ అతిథి విజయ్ దేవరకొండ.
 
ఈ ఎపిసోడ్ నవంబర్ 13న దీపావళి నాడు ప్రదర్శించగా సూపర్ హిట్ కొట్టింది. సమంత అక్కినేని నటించిన చిత్రాలే కాదు షోలు కూడా రికార్డులు బద్దలు కొడతాయని నిరూపించుకుంది ఈ అక్కినేని కోడలు. మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ తదుపరి అల్లు అర్జున్, తమన్నా భాటియా, రష్మిక మందన, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే కరోనా లాక్ డౌన్ విధించిన తర్వాత చాలామంది నటీనటులు తమతమ ఇళ్లకే పరిమితయ్యారు. ఐతే సమంత మాత్రం టెర్రస్ గార్డెన్, సొంత దుస్తుల దుకాణం, ఉపాసనతో కలిసి ఫిట్నెస్ సూత్రాల వరకూ ఫుల్ బిజీగా వున్నది. ప్రస్తుతం సామ్ జామ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది.