శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (12:54 IST)

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూట్ లో పాల్గొనబోతున్నారు

Vishwambhara
Vishwambhara
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా విశ్వంభర.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జరుగుతుంది. బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తో ఈ సినిమా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిరంజీవి లుక్ కూడా సిద్ధమైంది. ముందుగా గడ్డెం లేకుండా కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఇందుకు జనవరి మొదటి వారంలో డేట్ ఫిక్స్ చేశారు. 
 
ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం. ఈ చిత్ర కథ జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో పెద్దలను, పిల్లలను అలరించే దిశంగా వుండబోతోందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు ట్యూన్స్ సిద్దమయ్యాయని సమాచారం. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.