బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (17:27 IST)

ఆ పేరు పెట్టినం‌దుకు జ‌గ‌న్‌కు మెగాస్టార్‌ కృతఙ్ఞతలు

Saira, jagan
కర్నూల్ ఎయిర్ పోర్టుకు ప్రధమ  స్వాతంత్ర‌ సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు పెట్టడాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతటి గొప్ప దేశభక్తుడి పాత్రను తాను పోషించడం తన అదృష్టమని చిరు ట్వీట్ చేశారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి అనే టైటిల్ తో ఉయ్యాలవాడ జీవిత కథను సినిమాగా తీసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరు ఎక్కువగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం జగన్ కర్నూల్ ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరును ఖరారు చేయడం పై చిరంజీవి ఆనందం వ్యక్తం చేసారు.  ఇదిలా వుండ‌గా, ఉయ్యాల‌వాడ వార‌సులు కూడా ఎంత‌గానో ఆనందించారు. కాగా, సైరా సినిమాకుముందు వార‌సులు త‌మ వార‌సుల పేరు ఉప‌యోగించుకున్నందుకు చిరంజీవిని క‌లిసి కొన్ని విజ్ఞ‌ప్తులు చేశారు. వాటిని ప‌రిశీలిస్తాన‌ని కూడా ఆయ‌న హామా ఇచ్చాడు.