Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సందీప్ కిషన్ హీరోగా మెహరీన్ హీరోయిన్‌గా కొత్త చిత్రం

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (10:33 IST)

Widgets Magazine

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో విజ‌యాల్ని అందుకుంటున్న‌ సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌క‌థ చిత్రంతో యూత్‌ని ఆక‌ట్టుకున్న‌ మెహరీన్ హీరోయిన్‌గా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై స్వామిరారా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్‌తోపాటు, హీరోహీరోయిన్లపై ఒక పాటను కూడా వైజాగ్‌లో చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్నికాన్సెప్టెడ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం "నా పేరు శివ" ఫేమ్ సుసీంథరన్ దర్శకత్వం చేస్తున్నారు. ప్ర‌స్తుతం వైజాగ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'క‌బాలి' చిత్రంలో యాక్ష‌న్‌తో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన అంబు, అరివులు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తున్నారు. "గజరాజు"," జిల్లా", "రైల్" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన త‌మిళ సంగీత ద‌ర్శ‌క‌డు డి.ఇమ్మాన్ ఈ చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నారు.
 
ఈ సందర్భంగా సహ-నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. "నా పేరు శివ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా చాలా మంచి పేరు సంపాయించిన ద‌ర్శ‌కుడు సుసీంథ‌ర‌న్‌ దర్శకత్వంలో "నా పేరు శివ" తరహాలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా అదే స్థాయి కథ-కథనాలతో రూపొందుతుంది. దర్శకులు సుసీంధరన్ అద్భుతమైన కథను రెడీ చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్ష‌న్ పార్ట్‌ని క‌బాలి చిత్రానికి ప‌నిచేసిన అంబు, అరియు‌లు చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలో మా హీరో సందీప్ కిషన్ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపించనున్నారు. సందీప్ త‌ప్ప‌కుండా కొత్త కేర‌క్ట‌రైజేష‌న్‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌స్తుతం వైజాగ్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో సందీప్-మెహరీన్‌లపై ప్రముఖ కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ సారధ్యంలో ఒక పాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. 30 రోజులపాటు వైజాగ్ లో జరగనున్న ఈ భారీ షెడ్యూల్ కోసం ఒక సెట్ కూడా వేశారు, ఆ సెట్‌లోనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు. 
 
హీరోహీరోయిన్లతోపాటు సత్య, ప్రవీణ్, ధనరాజ్‌లు కూడా పాల్గొననున్న ఈ షెడ్యూల్‌లోనే అంబు, అరియు నేతృత్వంలో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తమిళ - తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరైన డి.ఇమ్మాన్‌గారిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మద్యం సేవించి అడ్డంగా బుక్కైన ఎస్ఎస్.రాజమౌళి కుమారుడు?

మద్యం సేవించి వాహనం నడపొద్దని పదేపదే ట్రాఫిక్ పోలీసులు హితవు పలుకుతున్నారు. అయినప్పటికీ.. ...

news

చెర్రీ - సుక్కు సినిమా కథ లీక్.. సోషల్ మీడియాలో హల్‌చల్

మెగా పపర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ ...

news

30 సెకన్లలో కోటి వ్యూస్... ఎంతమంది ఉన్నారన్నది కాదు ఎవడున్నాడన్నది ముఖ్యం (టీజర్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు'. డాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ...

news

నిర్మాతల మండలి ఎన్నికల బరిలో విశాల్... మద్దతు తెలిపిన కమల్‌హాసన్

తమిల చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో కోలీవుడ్ యువ హీరో విశాల్ నిలిచారు. ఆయనతో పాటు.. ...

Widgets Magazine