శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (19:23 IST)

కాలంతోపాటు మారుతున్న మిల్కీ బూటీ

Tamanna
మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సినిమా న‌టిగానే కాకుండా ప‌లు రంగాల‌వైపు దృష్టిపెట్టింది. కాలంతోపాటు ఆమె మారిపోయింది. అగ్ర‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఆమె ఆ త‌ర్వాత కొంత గేప్ తీసుకుంది. ఇప్పుడు వెబ్ సిరీస్‌వైపు దృష్టిపెట్టింది. ఆమ‌ధ్య ఆమె చేసిన లెవెన్త్ అవ‌ర్ ఓటీటీలో విడుద‌లైంది. ఇప్పుడు ఆమె మ‌రో రంగంవైపు మ‌ళ్లింది. 
 
ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మంలో క‌న్పించ‌బోతోంది. మాస్ట‌ర్ ఛెఫ్ పేరుతో రాబోతున్న ఈ ప్రోగ్రామ్‌కు ఆమె హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది. ఈ విష‌యాన్ని అధికారికంగా ఆ ఛాన‌ల్ ప్ర‌క‌టించ‌నుంది. ఇంత‌కుముందు స‌మంత పాల్గొన్న ఆహా హోస్ట్‌కు త‌మ‌న్నా గెస్ట్‌గా హాజ‌రైంది. ఆ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేస్తూ కుకింగ్ అనేది పెద్ద ఆర్ట్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మిస్ట‌ర్ చెఫ్ కార్య‌క్ర‌మం ఏమేర‌కు ఆస‌క్తిగా మ‌లుస్తారో చూడాలి. ఇప్ప‌టికే హాలీవుడ్‌లో స్టార్ వ‌ర‌ల్డ్‌లో ఇటువంటి ప్రోగ్రామ్ వ‌స్తుంది. ప్ర‌ముఖ న‌టీనటుల‌తోపాటు సెల‌బ్రిటీల‌తో కూడిన ఛెఫ్ కార్య‌క్ర‌మం ఇందులో చూపిస్తున్నారు. మ‌రి త‌మ‌న్నా ప్రోగ్రామ్‌లో ఏ త‌ర‌హాలో వుంటుందో త్వ‌ర‌లో తెలియ‌నుంది.