బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (13:27 IST)

భర్తతో వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉరేసుకున్న మోడల్ రిసిలా

బంగ్లాదేశ్‌కు చెందిన మోడల్ తన భర్తతో వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంగ్లాదేశ్‌లోని చిట్టాకాంగ్‌కు చెందిన రిసిలా బింటె (22) అనే మోడల్‌కు వివాహమైంది. మూడేళ్ల అమ్మాయి

బంగ్లాదేశ్‌కు చెందిన మోడల్ తన భర్తతో వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంగ్లాదేశ్‌లోని చిట్టాకాంగ్‌కు చెందిన రిసిలా బింటె (22) అనే మోడల్‌కు వివాహమైంది. మూడేళ్ల అమ్మాయి కూడా వుంది. ఈ నేపథ్యంలో సోమవారం తన భర్తతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ వుండిన రిసిలా ఉన్నట్టుండి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఒత్తిడి కారణంగానే భర్తతో మాట్లాడుతూ.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వివాహ జీవితంలో ఏర్పడిన విభేదాలే ఆమె ఆత్మహత్యకు దారితీశానని.. మరికొందరు పని ఒత్తిడి కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని చెప్తున్నారు. అయితే రసిలా ఆత్మహత్యకు గల ప్రధాన కారణం ఏంటనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 2012లో మోడల్‌గా రిసిలా క్యాట్ వాక్ చేసింది.