శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (12:05 IST)

మోహన్‌బాబు కొత్త కాన్సెప్ట్‌లు: పెదరాయుడు చక్కటి ఆల్బమ్

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటున్నాడు మోహన్‌బాబు. 40 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న ఆయన పలు చిత్రాలను దాచుకోవడానికి పనికివస్తాయని అన్నారు. రజనీతో నటించిన 'పెదరాయుడు' ఓ చక్కటి ఆల్బమ్‌గా పేర్కొన్నాడు.
 
ఈ చిత్రంలోని ఫొటోగ్రాఫ్‌లతో కూడా ఆల్బమ్‌ను ఎగ్జిబిషన్‌గా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు. అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్నచౌదరి స్క్రిప్ట్‌లను ఇప్పటి తరానికి ఉపయోగపడే విధంగా పుస్తకాలుగా ప్రింట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి కొత్త దర్శకులకు కొన్ని పాఠాలుగా ఇవి అందుబాటులో వుండేవిధంగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. ఇందుకు మంచు విష్ణు ఆ పనిని తన భుజాలపై వేసుకోనున్నాడు.