బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (18:07 IST)

చిరు వాయిస్ , మోహన్ బాబు యాక్షన్- నేను కసక్ అంటే.. మీరందరూ ఫసక్..?

Son of India
'సన్ ఆఫ్ ఇండియా' సినిమాలో మోహన్ బాబు లుక్ వైరల్ అవుతోంది. తాజాగా విడుదలైన 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్‌లో మోహన్ బాబు ఎన్నో గెటప్‌లలో కనిపిస్తున్నారు. అంతేకాదు, ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన రోజులను గుర్తు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇందులో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. 
 
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్‌ మొదలవుతుంది. ఇందులో 'మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. తన రూటే సపరేటు.. తను ఎప్పుడు? ఎక్కడ? ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లో ఎప్పుడు ఎలాంటి ఆలోచన పుడుతుందో ఏ న్యూమరాలజిస్టూ చెప్పలేడు' అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత మోహన్ బాబు కూడా తనదైన శైలి డైలాగులతో రచ్చ రచ్చ చేశారు. చివర్లో 'నేను కసక్ అంటే.. మీరందరూ ఫసక్' అని చెప్పే డైలాగ్ మరింతగా ఆకట్టుకుంది.