Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మొదలైన మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ!

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (14:56 IST)

Widgets Magazine
indraganti cinem still

అర్థవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్‌మెన్" వంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్-అవసరాల శ్రీనివాస్‌లు హీరోలుగా "ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై ఓ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నారు. కె.సి.నరసింహారావు నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో "అంతకు ముందు ఆ తర్వాత" ఫేమ్ ఈష, అదితి మ్యానికల్ కథానాయికలుగా నటించనుండగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. 
 
ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ కొట్టగా వినయ్ కెమెరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత "ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" సంస్థ అధినేత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ "నేడు పూజా కార్యక్రమాలతోపాటు రెగ్యులర్ షూట్ కూడా మొదలుపెట్టనున్నాం. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్‌లు కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈష, అదితి మ్యానికల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీత సారథ్యం వహించనున్న ఈ చిత్రానికి పి.జి.విందా కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు" అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దాపెట్టుకోవడం ఎంత తప్పో తెలిసింది.. అందుకే అందాలు ఆరబోస్తున్నా : రాశీఖన్నా

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాక మన వద్ద ఉన్నదాన్ని ఏదీ దాచిపెట్టుకోరాదనీ, అలా ...

news

బాహుబలి 2: విడుదలకు ముందే రికార్డ్.. రూ.500 కోట్ల బిజినెస్ అయ్యిందట..

ఖైదీ, శాతకర్ణి సినిమాలకు తర్వాత ఈ ఏడాదిలో మరో భారీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ...

news

నాన్నకు చైతూ-సమ్మూ ప్రేమ అప్పుడే తెలిసిపోయిందేమో.. వాళ్ళ పెళ్ళి వాళ్ల ఇష్టమే: నాగ్

'ఓం నమో వేంకటేశాయ' ప్రమోషన్‌లో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర ...

news

అల్లు అర్జున్ కోసం ఎగబడ్డ హైదరాబాద్ అమ్మాయిలు... బన్నీ సీరియస్‌, కానీ ఒకమ్మాయి పెట్టేసిందట...

నటుడు అల్లు అర్జున్‌ తనతో నటిస్తున్న కొందరి అమ్మాయిలపై సీరియస్‌ అయినట్లు తెలిసింది. ...

Widgets Magazine