శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (17:57 IST)

నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితిలో ఉన్నా : పాయల్ రాజ్‌పుత్

Payal Rajput
Payal Rajput
''నా జీవితంలో ముఖ్యమైన రోజు ఇది. ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. ఆమె నటించిన సినిమా మంగళవారం ట్రైలర్ నేడు విడుదలైంది. అనంతరం ఆమె మాట్లాడుతూ, నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో 'మంగళవారం' సినిమా వచ్చింది. నన్ను 'ఆర్ఎక్స్ 100'తో నన్ను అజయ్ భూపతి లాంచ్ చేశారు. అది నా కెరీర్ మార్చింది. ఇప్పుడు 'మంగళవారం'లో అవకాశం ఇచ్చారు. మరోసారి ఆయన నన్ను లాంచ్ చేస్తున్నారు. ఆయనకు థాంక్స్'' అని అన్నారు.

నందిత శ్వేతా మాట్లాడుతూ ''అజయ్ భూపతి గారు తీసిన కల్ట్, రస్టిక్, రా ఫిల్మ్ 'మంగళవారం'. అజయ్ గారి మొదటి సినిమాకి అడిగినప్పుడు చేయలేకపోయా. అది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ పిలిచారు. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నా క్యారెక్టర్, కథ, ఎవరెవరు ఉన్నారని అడగలేదు. వెంటనే ఓకే చెప్పేశా. ఈ సినిమాలో వెరీ రా క్యారెక్టర్ చేశా. ఈ సినిమా చేశాక నాకు తెలుగు బాగా వచ్చింది. ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది'' అని అన్నారు.