ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మురళీకృష్ణ
Last Modified: శనివారం, 8 మే 2021 (13:26 IST)

అదే నాన్నకు నేనిచ్చే నివాళి: హీరో గోపీచంద్‌

దర్శక సంచలనం టి. కృష్ణ వర్థంతి మే 8. ఆయన చేసిన చిత్రాలు ఇప్పటికీ గర్తుండిపోయినవిగా రికార్డు సృష్టించాయి. టి. కృష్ణ ఎన్నో చిత్రాలను చేయాల్సింది కానీ క్యాన్సర్ వ్యాధితో ఆయన మే 8న కన్నుమూశారు. ఆయన పెద్ద కొడుకు ప్రేమ్ చంద్ కూడా ద‌ర్శ‌కుడు కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ అనుకోని ప్ర‌మాదంతో అత‌ను చ‌నిపోయాడు.
 
ఇక మిగిలింది ఇప్పుడున్న హీరో గోపీచంద్. ఏదైనా విప్ల‌వాత్మ‌క క‌థ‌లు వుంటే మా నాన్న‌గారిలా తీసే ద‌ర్శ‌కుడు వుంటే నేనెప్పుడూ సిద్ధ‌మే అంటూ పేర్కొన్నారు కూడా. ఇలాంటి క‌థ‌ల కోసం క‌మ్యూనిస్టు పార్టీకి చెందిన ప‌లు సంఘాల నాయ‌కుల‌ను ఆయ‌న కోరారు. కానీ ఫలితం లేదు.
 
అందుకే బ‌య‌ట ర‌చ‌యిత‌లు ఎవ‌రైనా ముందుకు వ‌స్తారేమోన‌ని ఆయ‌న ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా చేస్తేనే నా తండ్రికి నేనిచ్చే స‌రైన నివాళి అని ఆయ‌న చెబుతున్నారు.