మై నేమ్ ఈజ్ శృతిగా హన్సిక
ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజే స్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్ థ్ల్రిలర్‌ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిది. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం.
ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం అన్నారు. మురళీశర్మ, జయప్రకాష్, ఆడుకాలం నరెన్, రాజా రవీంద్ర, సీవీఎల్ వినోదిని, సాయితేజ్ కాల్వకోట, మహేష్ తదితరులు నటిస్నున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్.కె.రాబిన్, ఎడిటర్: చోట.కె.ప్రసాద్, ఆర్ట్: గోవింద్ ఇరసాని, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బరావు గూడపాకల, లైన్ ప్రొడ్యూసర్: కె.విజయ్‌కుమార్, సహ నిర్మాతలు: పవన్‌కుమార్ బండి, ఎజీ ఎలియస్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.