శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (10:25 IST)

మూడు నెలలకే అబార్షన్ 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను.. చిన్మయి (video)

Chinmayi Sripada
సింగర్ చిన్మయి శ్రీపాద ఎమోషనల్ పోస్టు చేశారు. తన ప్రెగ్నెన్సీపై పలు విషయాలను పంచుకున్నారు. పేరెంట్స్ అవ్వాలని అనుకున్నా కరోనా కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. సెకండ్ వేవ్ తర్వాత గర్భం దాల్చగా మూడునెలలకే అబార్షన్ అయిందని తెలిపారు. ఆ సమయంలో మానసికంగా ఇబ్బంది పడినట్లు వెల్లడించారు.
 
"కొన్నిరోజుల తర్వాత నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడికల్‌ డాక్టర్‌ ఎమిలీ అనే ఆవిడ పరిచయం అయ్యింది. తన సలహాలతో నేను డైట్‌, ఎక్సర్‌సైజ్‌ అన్నీ పాటించాను. అవన్నీ దాదాపు మన ఇండియన్‌ ఆయుర్వేదిక్‌ పద్దతులే. కొంతకాలానికి నేను మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఇప్పుడు కవలలకు జన్మనిచ్చి 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను" అని తన ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేసుకుంది. కాగా చిన్మయి నటుడు రాహుల్ రవీంద్రన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వీరికి కవలలు జన్మించారు.