సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 జనవరి 2025 (17:40 IST)

కలర్‌‌ఫుల్‌గా 12 మంది నాయికలతో మై సౌత్ దివా క్యాలెండర్ 2025

Malvi Malhotra, kanika mann, Aishwarya krishna, Manoj Kumar Katokar, palak agarwal,Rhea Sachdeva
Malvi Malhotra, kanika mann, Aishwarya krishna, Manoj Kumar Katokar, palak agarwal,Rhea Sachdeva
ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ మనోజ్‌ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక మై సౌత్‌ దివా క్యాలెండర్‌ ద్వారా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పరిచయమై.. అగ్రశ్రేణిలో ఉన్నారు.  తాజాగా 2025 క్యాలెండర్ ను 12 మంది స్టార్స్ తో శుక్రవారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా,  కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు,  వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పలక్ అగర్వాల్ తో  ఈ క్యాలెండర్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
 
 క్యాలెండర్ ఫౌండర్ మనోజ్ కుమార్ కటొకర్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డితోపాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్, దర్శకులు కరుణ కుమార్, సుజనా రావు ముఖ్య అతిథులుగా హాజరై తమ విషెస్ తెలియజేశారు.
 
ఈ సందర్భంగా... మై సౌత్ దివా క్యాలెండర్ ఫౌండర్, ఫోటో గ్రాఫర్ మనోజ్ కుమార్ కటొకర్ మాట్లాడుతూ.."మా క్యాలెండర్ ను తొమ్మిది ఏళ్లుగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 12 మంది హీరోయిన్స్ తో కూడిన ఈ క్యాలెండర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. మా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే  కొత్తవారిని మోడల్స్ గా పరిచయం చేశాం. అలాగే కొంతమంది హీరోయిన్స్ గా మంచి గుర్తింపును అందుకున్నారు.  ఈ ఏడాది మరో ఐదుగురిని  ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన మా పార్ట్నర్స్ భారతి సిమెంట్స్,  కియారా జ్యువెలరీ, ఈరా క్లినిక్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని చెప్పారు.  
 
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ మాట్లాడుతూ ‘ఈ క్యాలెండర్‌‌లోని కలర్స్‌ చాలా బాగున్నాయి. మనోజ్  చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు’అని చెప్పారు.
 
డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ ‘‘పలాస’ మూవీ టైమ్‌లో మనోజ్ గారు నాకు  చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఆయనతో నాకు ఐదేళ్ల జర్నీ ఉంది. ఇప్పటికీ నా సినిమాల్లో  హీరోయిన్స్ కోసం ఆయన రిఫరెన్స్ తీసుకుంటాను. ఈ సందర్భంగా ‘పలాస’ చిత్రాన్ని మార్చి 6న రీ  రిలీజ్ చేయాలని ప్రకటిస్తున్నాం’ అని చెప్పారు.
 
దర్శకురాలు సుజనారావు మనోజ్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ‘సౌత్ దివా  క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక క్యాలెండర్‌‌లో చాలా కల్చర్స్ ఉండటం మంచి పరిణామం.  స్టార్ హీరోయిన్స్‌తో ఉన్న ఈ క్యాలెండర్ కలర్‌‌ఫుల్‌గా ఉంది’ అని చెప్పారు.
 
‘హైడ్ అండ్ సీక్’ మూవీ హీరోయిన్ రియా సచ్‌దేవ్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్‌ మర్చిపోలేనిది’ అని చెప్పింది.
 హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాలెండర్‌‌ ద్వారా చాలా మంది న్యూ టాలెంట్ ఇండస్ట్రీకి వస్తుంది’ అని అన్నారు.
 
ఈ కార్యక్రమానికి హాజరైనహీరోయిన్స్ ఐశ్వర్య కృష్ణ, పలక్ అగర్వాల్, కనిక మాన్, అనుశ్రీ, రిచా జోషి,జెస్సీ మాట్లాడుతూ... "మై సౌత్ దివా క్యాలెండర్ తొమ్మిదవ ఎడిషన్ లో భాగమవడం చాలా హ్యాపీగా ఉంది" అని అన్నారు.