ఎన్నికల తర్వాత పవన్ సినిమా చేస్తారా?

pawan kalyan
Last Updated: మంగళవారం, 30 అక్టోబరు 2018 (17:53 IST)
మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా చేయబోతున్నారని టాక్ వస్తోంది. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతోన్న మైత్రీ మూవీ మేకర్స్ కొందరు హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ ఇచ్చారని.. అలా అడ్వాన్స్ తీసుకున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని సమాచారం. 
 
మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉంటుందట. కానీ పవన్ రాజకీయాలతో బిజీ కావడంతో.. ఆ కథని రవితేజతో చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి పవన్ నుండి అనుమతి కూడా తీసుకున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు చెప్తున్నారు. 
 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలని కేటాయించారని ఇకపై సినిమాలకి సమయం ఉండదని చెప్పినట్లు టాక్. అయితే పవన్‌కి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకోలేదని.. ఆయనతో సినిమా వుంటుందని మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది. ఎన్నికల తర్వాత పవన్ సినిమాలు చేస్తారని.. పవన్ సినిమాపై వివాదాలు వద్దని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తెలిపారు.దీనిపై మరింత చదవండి :