శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2015 (11:13 IST)

అమ్మో.. నయనతార అంత బక్కపలచగా ఉందే.. మరీ అంత నాజూగ్గానా?

నయనతార ఆల్ మోస్ట్ టాప్ హీరోలతో నటించేసింది. అయినప్పటికీ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. యంగ్ హీరోలతో ఈజీగా నటించేస్తుంది. సినిమా జర్నీ మొదలెట్టి పదేళ్లయినా సరే... ఇప్పటికీ కుర్రహీరోల పక్కన ఆఫర్లు అందుకొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది నయనతార. తోటి హీరోయిన్లకు కూడా నయనతార కెరీర్‌ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. 
 
తాజాగా నానుం రౌడీ దాన్ సినిమాలో విజయ్ సేతుపతి సరసన నయనతార నటించింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో నయనతార అందాలు చూసి అందరూ షాక్ తిన్నారు. ఈ ట్రైలర్లో నయన బక్కపలచగా.. నాజుగ్గా కనిపిస్తోందట. 
 
ఈ సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిన ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ... విజయ్‌ సేతుపతితో కెమిస్ట్రీ కూడా బాగా పండించినట్టు అనిపిస్తోందని కోలీవుడ్ సినీ పండితులు అంటున్నారు. మొత్తంమ్మీద విఘ్నేష్ శివన్ తన ప్రేమను తెరపై మరింత అందంగా చూపెడుతాడని కోలీవుడ్ ఫిలిమ్ వర్గాల సమాచారం.