గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

తన విడాకులపై వచ్చేవన్నీ తాత్కాలికమైన పుకార్లే : నాగ చైతన్య

naga chaitanya
ఒక వార్తను మరో వార్త భర్తీ చేస్తుందని, తన విడాకులపై వచ్చే పుకార్లన్నీ తాత్కాలికమైనవేనని హీరో
నాగ చైతన్య అన్నారు. తన భార్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయన తొలిసారి జాతీయ మీడియాతో తన విడాకులపై స్పందించారు. తన స్నేహితులు, కుటుంబం, తన చుట్టూ ఉన్న వాళ్లందరికీ విషయం ఏంటో తెలుసని చెప్పారు. అందువల్ల ఈ విషయంపై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. 
 
మంచైనా చెడైనా తాను మీడియాకు సమాచారం ఇచ్చే జీవితంలో ముందుకెళ్లానని, ఇపుడు విడాకుల విషయంలోనూ అదే చేశానని తెలిపారు. ఇపుడు విడాకుల తర్వాత సమంత మరో అడుగు ముందుకు వేశారనీ, తాను కూడా తన పని తాను చేసుకుంటూ సాగిపోతున్నానని వెల్లడించారు. అంతకు మించి ఈ ప్రపంచానికి తానేం చెప్పాలనుకోవడం లేదని నాగచైతన్య అన్నారు. 
 
ఆయన ప్రత్యేక పాత్రలో నటించిన 'లాల్ సింగ్ చద్దా' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ విడాకుల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై చైతూ స్పందించారు. తన విడాకులక అంశానికి దూరంగా ఉండాలని మొదటి నుంచి భావిస్తూ వచ్చానని, ఈ అంశంపై తాను కూడా అంతే స్పందించానని చెప్పారు.