సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (12:34 IST)

దీపావళి రోజున నాగచైతన్య - సాయి పల్లవికి పెళ్లి!!??

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ సినిమా లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. లవ్ స్టోరీ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. లవ్ స్టోరీ సినిమా థియేటర్ లు ఓపెన్ కాగానే సరైన సమయం చూసుకుని విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. వెలుగుల పండగ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.
 
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు, రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.