కరోనా సమయంలో ఊపిరాడక పలు ఇబ్బందులు పడ్డాను: నాగబాబు

nagababu
వి| Last Modified బుధవారం, 28 అక్టోబరు 2020 (17:04 IST)
కరోనా మహమ్మారి బారిన ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ నటులు చిక్కుకొని కోలుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా కోరల్లో చిక్కుకొని బయటపడ్డారు. అయితే కరోనా సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి నాగబాబు తాజాగా వెల్లడించారు. కరోనా సోకిన వెంటనే తాను చాలా కంగారు పడ్డానని తెలిపారు.

తనకు ఆస్తమా సమస్య ఉండటంతో వెంటనే ఆస్పత్రిలో చేరాననీ, కొన్నిసార్లు ఊపిరి ఆడక ఇబ్బంది పడినా వైద్యుల సలహా మేరకు మామూలు స్థితికి వచ్చానని తెలిపారు. తరువాత తాను డిశ్చార్జ్ అయినా కూడా ఇంట్లో వారం రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉన్నానని తెలిపారు.

తను ఇంటికి చేరుకునే లోపు తన సతీమణి పద్మజకు కరోనా సోకడంతో ఇద్దరం కలిసి ఇంట్లో వారం రోజులు స్వీయనిర్బంధం పాటించామని తెలిపారు. తన భార్య ఆరోగ్యవంతురాలు కావడంతో త్వరగా కోలుకున్నారని తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించినా త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఫ్యాన్సును కోరారు.దీనిపై మరింత చదవండి :