1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (16:38 IST)

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

Allu Arjun-Nagababu
ఐకాన్ అల్లు అర్జున్‌పై పరోక్షంగా విరుచుకుపడిన నాగబాబు.. ఆపై తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. ఇందుకు కారణం నాగబాబుపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర టార్గెట్ చేయడమే. కట్ చేస్తే.. మెగాబ్రదర్ నాగబాబు ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చారు.
 
"నా ట్వీట్‌ని తొలగించాను" అని నాగబాబు కొద్దిసేపటి క్రితం ట్వీట్‌ చేశారు. అల్లు అర్జున్ అభిమానులకు షాకిచ్చే క్రమంలో మిత్రుల గురించి గతంలో అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసిన ట్వీట్‌ను తొలగించారు. 
 
వివాదాస్పద ట్వీట్ తొలగించినా.. అల్లు ఫ్యాన్స్ వదలట్లేదు. తాజా ట్వీట్ పైనా జోరుగా కామెంట్స్ ఇస్తున్నారు. వాటిలో చాలా వరకు నెగెటివ్ కామెంట్సే ఉంటున్నాయి.