గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (11:42 IST)

ఆరెంజ్ స్పెషల్ షో తిలకించిన నాగబాబు టీం

Sandha 70mm. nagabu and team
Sandha 70mm. nagabu and team
గ్లోబల్ స్టార్ అయ్యాక రాంచరణ్ సినిమా ఆరెంజ్ ను శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా డిజాస్టర్. కాగా, ఈ చిత్రాన్ని నిర్మాత నాగబాబు చరణ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా అన్ని థియేటర్లు లో సెన్సేషనల్ గా మారింది. హైదరాబాద్  ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో  ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది.
 
Orange cake cutting
Orange cake cutting
నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజున హైద్రాబాద్లో సంధ్య 70 ఎంఎం లో వేశారు. నాగబాబుతో పాటు  పలువురు సెలెబ్రెటీ లు కూడా హాజరు అయ్యారు. ఈ షో చూసి నాగబాబు  టీం అక్కడే కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. రామనవమి రోజు ఉదయం 8 గంటలకి ఈ షో ని ప్లాన్ చేశారు.  ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా హరీష్ జై రాజ్ సంగీతం అందించారు. జెనీలియా హీరోయిన్ గా నటించింది.