శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (20:35 IST)

చైత‌న్య‌, స‌మంత‌ల 'మ‌జిలీ' ఆ క్ల‌బ్‌లో... లవర్ పాయింట్ టచ్ చేసినందుకా?

అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన చిత్రం మ‌జిలీ. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే... ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంది. క‌లెక్ష‌న్స్ ఎంత వ‌స్తాయి అనేది మాత్రం కొంచెం డౌట్‌గా ఉండేది సినీ పండితుల‌కు. ఎందుకంటే... ఈ సినిమాలో పెద్ద‌గా కామెడీ లేదు.
 
చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది. అందుచేత ప్రేక్ష‌కులు ఎంతవ‌ర‌కు రిసీవ్ చేసుకుంటారు అని అక్కినేని అభిమానులు సైతం ఉత్కంఠ‌గా ఎదురు చూసారు. అయితే... 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రిలీజైన 5 రోజుల‌కే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ సినిమా రిలీజై రెండు వారాలు అయినా ఇప్ప‌టికీ హౌస్‌ఫుల్ కల‌క్ష‌న్స్‌తో స‌క్స‌ెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి.. 50 కోట్ల క్ల‌బ్‌లో చేరి చైత‌న్య కెరీర్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన సినిమాగా నిలిచింది.