మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 3 మార్చి 2020 (20:59 IST)

చైతు వెర్సెస్ అఖిల్, ఏప్రిల్ నెలలో రాబోతున్న అన్నదమ్ములు

అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవ తరంలో నాగ చైతన్య, అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అక్కినేని హీరోలిద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చైతన్య ఆతర్వాత ఏమాయచేసావే, 100 పర్సంట్ లవ్, తడాఖా, మనం... ఇలా ప్రేమకథా చిత్రాల్లోను, కుటుంబ కథా చిత్రాల్లోను నటిస్తూ యూత్ కి బాగా దగ్గరయ్యాడు. యాక్షన్ మూవీస్ చేయాలి... మాస్‌లో క్రేజ్ తెచ్చుకోవాలని తపించే.. చైతన్య చేసిన మాస్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో ఆలోచనలో పడిన చైతన్య తనకు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీస్ నే నమ్ముకున్నాడు. 
 
ఇటీవల నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం మజిలీ. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన మజిలీ సినిమా అందర్నీ ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ అయ్యింది.
 
ఈ సినిమా దాదాపు 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చైతన్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత చైతు చేసిన సినిమా వెంకీ మామ. ఇందులో మేనమామ వెంకటేష్, మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటించారు. అక్కినేని అభిమానులు, దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూసిన వెంకీ మామ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
ఈ సినిమా కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకుని విజయం సాధించింది. 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు.
 
ఈ సినిమాలో సాయిపల్లవి నటిస్తుంది. ఈ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ సమర్పణలో యువ నిర్మాతలు బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 
 
ఇందులో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. అఖిల్ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సస్ సాధించాలనే పట్టుదలతో వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసింది. డేట్ ఎప్పుడు అనేది త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు. మరోవైపు చైతన్య లవ్ స్టోరీ మూవీ కూడా ఏప్రిల్ లోనే విడుదల అని ప్రకటించారు. సో.. ఏప్రిల్‌లో ఈ అన్నదమ్ముదల ఇద్దరూ పోటీపడతారు అని వార్తలు వస్తున్నాయి. అయితే.. ప్రకటించినట్టుగా ఏప్రిల్ లో వస్తారో లేక ఒకరు ఏప్రిల్ ఒకరు మేలో వస్తారో చూడాలి.