శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (14:30 IST)

నాగార్జున యాక్ష‌న్ సినిమా శ్రీ‌కారం చుట్టారు

Nagarjuna, new movie poorj
అక్కినేని నాగార్జున త‌న కొత్త సినిమాను మంగ‌ళ‌వారంనాడు శ్రీ‌కారం చుట్టారు. సికింద్రాబాద్‌లోని గ‌ణేశ్వ‌రుని టెంపుల్‌లో లాంఛ‌నంగా ప్రారంభించారు. త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో నాగార్జున చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను శ‌ర‌త్ మ‌రార్‌, ఏషియ‌న్ సునీల్‌నారంగ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎస్‌విసిఎల్ఎల్‌.పి. బేన‌ర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. మొద‌టి షెడ్యూల్ గోవాలో జ‌ర‌గ‌నుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. పంచ‌మి తిథి అయిన ఈరోజే నాగార్జున న‌టించిన `బ్ర‌హ్మాస్త్ర` గురించి వివ‌రాలు కూడా తెలియ‌జేశారు. అందులో త‌న పాత్ర షూటింగ్ ముగిసింద‌ని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మ‌రో సినిమాతో బిజీగా వున్నారు.