ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (10:12 IST)

పెళ్లి చేసుకుంటే చాలా సంతోషిస్తా.. నగ్మా ఆసక్తికర వ్యాఖ్యలు

nagma
ఒకప్పుడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి నగ్మా. చాలా కాలం పాటు దక్షిణాదిలో అగ్ర నటిగా కొనసాగింది. ఆమె టాలీవుడ్‌ని వదిలి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఆమె 1990లో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న బాఘీ చిత్రంలో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఇది హిందీ సినిమాల్లో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన ఏడవ చిత్రం. 
 
ఆమె ఘరానా మొగుడు, కింగ్ అంకుల్, సుహాగ్, కాధలన్, బాషా, లాల్ బాద్షా వంటి చిత్రాల ద్వారా పాపులర్ అయ్యింది. ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో నటించిన ఆమె 2008లో పూర్తిగా నటనకు స్వస్తి చెప్పింది. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది. 
 
నగ్మాకు 48 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీతో కొంతకాలం ప్రేమాయణం సాగించింది. తాజాగా నగ్మా మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లిపై స్పందించింది. పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. 
 
తనకు కూడా భాగస్వామి, పిల్లలు కావాలని ఆశించానని తెలిపింది. పెళ్లి ద్వారా సంసారం సాగించాలనే ఆలోచనలో ఉన్నానని.. సమయం అనుకూలిస్తే తన పెళ్లి జరుగుతుందో లేదో చూస్తానని చెప్పింది. పెళ్లి చేసుకుంటే చాలా సంతోషిస్తానని తెలిపింది.