శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (17:45 IST)

నమిత ఆ కారణంగా లావైందట.. తాగుడు వల్ల కాదట..!

దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసిన నమిత పెళ్లయిన తర్వాత అడపాదడపా నటిస్తోంది. 2017లో ఆమె తెలుగు కుర్రాడు వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. అయితే, ఇటీవలే నమిత ఆకారంపై సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. మద్యపానం కారణంగా అమ్మడు బాగా లావైపోయిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై నమిత స్పందించక తప్పలేదు.
 
తన అధిక బరువుకు థైరాయిడ్, పీసీఓడీనే కారణమని వెల్లడించింది. అంతే తప్ప, జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను 97 కేజీల బరువున్నానని, అందులో దాపరికం ఏదీ లేదని వివరించింది. అనేక మానసిక ఒత్తిళ్లతో జీవితాన్ని కోల్పోతున్న ఫీలింగ్ కలిగిందని, ఆ సమయంలో యోగా ద్వారా మానసిక ప్రశాంతతను తిరిగి పొందగలిగానని నమిత చెప్పుకొచ్చింది.
 
త‌న బ‌రువు గురించి దాచిపెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని, తాను 97 కిలోలున్నాన‌ని చెప్పింది. ప‌లు మాన‌సిక ఒత్తిళ్ల కార‌ణంగా లైఫ్‌ను త్యాగంచేద్దామ‌నుకున్నాన‌ని, అయితే యోగా చేయ‌డం ద్వారా మానసిక ప్ర‌శాంత‌త క‌లిగి సంతోషంగా ఉన్నాన‌ని వెల్లడించింది.
 
సినిమాలు, రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది నమిత. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు ఎన్నో విషయాలు పంచుకుంటోంది.