శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (13:24 IST)

‘భగవంత్ కేసరి’ గ్రాండ్ టీజర్ లాంచ్.. బాలయ్య పుట్టినరోజు బిగ్ ట్రీట్

Balakrishna
Balakrishna
దసరాకి బాలకృష్ణ గారి ‘భగవంత్ కేసరి’ ఎంటర్ టైన్ మెంట్ మామూలుగా ఉండదు. భగవంత్ కేసరి.. ఈ పేరు శానా యేండ్లు యాదుంట‌ది: భగవంత్ కేసరి గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి. 
 
ఫస్ట్ ప్రమోషనల్ క్యాంపెయిన్- టైటిల్ రివిల్ గ్రాండ్‌‌గా జరిగి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో బిగ్ ట్రీట్ వచ్చింది. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి, హరీష్ పెద్ది క్రేజీ కాంబినేషన్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’ టైటిల్ పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదలై టెర్రిఫిక్ రెస్పాన్స్ అందుకుంది.
 
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ చిత్రం టీజర్‌ ను లాంచ్ చేశారు. టీజర్ ప్రపంచవ్యాప్తంగా 108+ థియేటర్లలో స్క్రీన్ చేశారు. టీజర్ ని పెద్ద స్క్రీన్‌ లపై చూడటం అభిమానులకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.
 
‘భగవంత్ కేసరి’ పాత్రలో బాలకృష్ణ ను పవర్ ప్యాక్డ్ పాత్రలో ప్రజెంట్ చేసింది టీజర్. రాజు అహంకారానికి, మొండివాడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాలకృష్ణ వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అర్జున్ రాంపాల్‌ ను రూలర్  గా పరిచయం చేయగా, బాలకృష్ణ  ను మొండివాడిగా చూపించారు. ‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి’ అని తనను తాను పరిచయం చేసుకున్నారు బాలయ్య. ‘ఈ పేరు శానా యేండ్లు యాదుంట‌ది’ అని బాలకృష్ణ చెప్పినట్లుగానే ఇది చాలా కాలం  పాటు గుర్తుండిపోతుంది. ఎన్ బి కే బ్యాట్‌ ని పట్టుకుని గిటార్‌లా వాయిస్తూ లైటర్ నోట్ లో టీజర్ ఎండ్ కావడం మరో స్వీట్ ట్రీట్ లా వుంది.
 
టీజర్ ఊహకు మించి వుంది. ‘భగవంత్’ కేసరి ఖచ్చితంగా సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదని టీజర్ ద్వారా తెలుస్తుంది. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని పాత్రలో అనిల్ రావిపూడి చూపించారు. గెటప్ నుంచి క్యారెక్టరైజేషన్ వరకు పూర్తి భిన్నంగా ఉంది. బాలకృష్ణ మాస్, అరోగెన్స్ , కూల్‌ నెస్ కూడా టీజర్ లో చూపించారు. హిందీ, తెలంగాణ యాసలో బాలకృష్ణ చెప్పిన డైలాగులు దద్దరిల్లాయి. ‘ఐ డోంట్ కేర్’ అనే ట్యాగ్‌ లైన్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. రూలర్  గా అర్జున్ రాంపాల్ డెడ్లీ రోల్ లో కనిపించారు.
 
ఎన్‌ బి కె నుంచి ఆశించే అన్ని అంశాలను ఇందులో చేర్చారు అనిల్ రావిపూడి. ముఖ్యంగా అభిమానులకి ఇది పండగలా వుంది. సి రామ్ ప్రసాద్ కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. ఎస్ థమన్ తన ఎక్స్ టార్డినరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ తో అద్భుతమైన ఎఫెక్ట్ ఇచ్చారు. ప్రొడక్షన్ డిజైన్ రిచ్‌ గా ఉంది. మొత్తానికి టీజర్ మాస్ విధ్వంసం సృష్టిస్తుంది.
 
గ్రాండ్ గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మేము టీజర్ లో చెప్పినట్లే  భగవంత్ కేసరి .. ఈ పేరు శానా యేండ్లు యాదుంట‌ది. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో బాలయ్య బాబు హిందీ డైలాగులు చెబితే థియేటర్లు దద్దరిల్లాయి. తెలంగాణ నేపథ్యం కావడంతో ఇందులో కూడా అక్కడక్కడ కొన్ని హిందీ డైలాగులు పెట్టాం. టీజర్ లో సర్ ప్రైజ్ గా హిందీ డైలాగ్ ఇచ్చాం.  బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారనేదానికి టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. దసరాకి భగవంత్ కేసరి ఎంటర్ టైన్ మెంట్ మామూలుగా ఉండదు. అభిమానులతో పాటు తెలుగు సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరూ ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బాలకృష్ణ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. భగవంత్ కేసరి నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. తమన్ గారికి బాలయ్య బాబు అంటే పూనకం వచ్చేస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీశారు. ఇది బిగినింగ్ మాత్రమే. ముందు ముందు చాలా వస్తాయి. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్. భగవంత్ కేసరి జర్నీ..  జస్ట్ బిగినింగ్ . దసరా వరకూ కలుస్తూనే ఉందాం’’ అన్నారు.
 
అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇంత పిచ్చి ప్రేమ నేను జీవితంలో చూడలేదు. భగవంత్ కేసరి ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేయాలి. నేను చాలా మంది స్టార్స్ తో పని చేశాను. కానీ బాలకృష్ణ గారు చాలా ప్రత్యేకం. ఆయన వ్యక్తిత్వం అద్భుతం. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. జై బాలయ్య’’ అన్నారు.
 
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ..  ఇది మేము అభిమానులకు ఇచ్చే కానుక. దసరాకి వస్తున్నాం. దర్శకుడు అనిల్ రావిపూడి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా సినిమాని తీర్చిదిద్దారు. ఈ దసరాకి అన్ని రికార్డులు భగవంత్ కేసరి సొంతం చేసుకుంటుంది. మేము అభిమానులుగా అభిమానులకు ఇచ్చే సినిమా భగవంత్ కేసరి’’ అన్నారు
 
నిర్మాత హరీష్ మాట్లాడుతూ.. ఇది శాంపిల్ మాత్రమే.  ఈ దసరాకి మీ అందరినీ ఉత్సాహపరుస్తాం’’ అన్నారు.
 
డీవోపీ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. బాలయ్య గారితో  అఖండ సినిమా చేశాను. దాని కంటే పది రెట్లు బాగుంటుంది భగవంత్ కేసరి. అనిల్ అద్భుతంగా తీశారు’’ అన్నారు.
 
భగవంత్ కేసరి షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది, ఇందులో కోర్ టీమ్ పాల్గొంటుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.
 
తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌ కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ  చేస్తున్నారు. భగవంత్ కేసరి విజయదశమి (దసరా)కి థియేటర్లలో విడుదల కానుంది.
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్