నవరసాలతో కూడిన చిత్రాలు మా వంశంతోనే సాధ్యం : బాలకృష్ణ

nbk - jr ntr
Last Updated: సోమవారం, 22 అక్టోబరు 2018 (13:34 IST)
జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రం సక్సెస్ మీట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో హీరో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను, తారక్ చేసే సినిమాలు మరెవరూ చేయలేరని, అసాధ్యమన్నారు.

ముఖ్యంగా మేము నటించే చిత్రాల్లో నవరసాలు ఉంటాయన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలను గొప్పగా తీస్తారని కితాబిచ్చారు. చారిత్రక సినిమాలు, పోరాట చిత్రాలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరన్నారు. తమ అభిమానులంతా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.

ఇకపోతే, టీడీపీ తొలి శ్రామికుడు, చైతన్య రథసారధి, మా అన్నయ్య హరికృష్ణ మన మధ్య లేరంటే నమ్మలేక పోతున్నట్టు చెప్పారు. తాను ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా ఉండి ఈ సినిమాను చూడలేకపోయినట్టు చెప్పారు. మహిళ అంటే ఎంతో గొప్పది అనే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు.దీనిపై మరింత చదవండి :