శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (16:52 IST)

సమంత సరిదిద్దుకుంది.. హరికృష్ణగారూ అంటూ ట్వీట్ చేసింది..

నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ సమంత చేసిన ట్వీట్ ఆమెకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పొరపాటున హరికృష్ణ తరవాత

నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ సమంత చేసిన ట్వీట్ ఆమెకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పొరపాటున హరికృష్ణ తరవాత ‘గారు’ లేకుండా సమంత ట్వీట్ చేయడంతో ట్విట్టర్‌లో రచ్చ మొదలైంది. ముందు పెద్దవారిని గౌరవించడం నేర్చుకోమంటూ నెటిజన్లు సమంతపై కామెంట్స్ చేశారు. 
 
అయితే సమంత తన తప్పును సరిదిద్దుకుంది. ముందు చేసిన ట్వీట్‌ను తొలగించి.. ''రిప్ హరికృష్ణ గారూ'' అంటూ మరో ట్వీట్ చేసింది. హరికృష్ణ గారు లేరని తెలిసి షాకయ్యానని… బాధపడ్డానని తెలిపింది. కష్టకాలంలో ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పింది. అప్పటికే సమంత చేసిన రెండు ట్వీట్లు స్క్రీన్ షాట్ల రూపంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో మిస్టరీ థిల్లిర్‌గా తెరకెక్కిన యూటర్న్ మూవీ సెప్టెంబర్ 13న భారీ విడుదలకు రెడీ అయ్యింది. స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. సమంత జర్నలిస్ట్‌గా కనిసిస్తుండగా.. ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. భూమిక, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు.