బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2024 (16:42 IST)

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కాంబినేషన్ చిత్రం వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం

Kalyanram at shoot
Kalyanram at shoot
నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో, ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  
 
తాజాగా టీం, లీడ్ కాస్ట్ పాల్గొంటున్న కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్రారంచింది. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, విజయశాంతి, శ్రీకాంత్, సాయి మంజేరకర్, యానిమల్ పృథ్వీవీరాజ్‌లతో కూడిన టాకీ పార్ట్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు.
 
సెట్ నుండి మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో కళ్యాణ్ రామ్ ఆలోచిస్తున్నట్లు కనిపించగా, ప్రొడక్షన్ టీమ్ వారి టాస్కలు చేస్తూ కనిపించారు. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా మేజర్ పార్ట్ పూర్తవుతుంది.
 
సోహైల్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.
 
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్ తదితరలు