శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:56 IST)

నేచురల్ స్టార్‌ నానీతో స్పెషల్ సాంగ్‌కి రకుల్ సై..??

ప్రస్తుతం 'జెర్సీ' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న న్యాచురల్ స్టార్ నానీ.. తన తరువాతి సినిమాను కూడా లైన్‌లో పెట్టేసినట్లు వినబడుతోంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలలోకి వెళ్తే... 'మనం', 'ఇష్క్'‌, '24' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్ కార్తికేయ ఒక కీలక పాత్రని పోషించనున్నారు. అయితే... తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాలలో వినబడుతోంది.
 
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో... రకుల్ ప్రీత్‌ సింగ్‌ ఒక స్పెషల్‌ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. నాని సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్ స్పెషల్‌ సాంగ్ చేయనుండడం ఈ సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్ అవబోతోందనే టాక్‌ ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది.