ఇంద్రగంటి "వ్యూహం"లో నానీ హీరో కాడా?

వాసు| Last Updated: శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:53 IST)
నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం... 'జెర్సీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా వున్నాడు. ఒక వైపున ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో వైపున ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి నానీ సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధం కావడం, ఈ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్‌ను ఖరారు కావడం అందరికీ తెలిసిన విషయాలే. కాగా... ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటించనుండడంతో, ఇది మల్టీ స్టారర్ మూవీ అనే ప్రచారాలు జోరందుకున్నాయి.

అయితే ఈ సినిమాలో నానీ కొంతసేపు మాత్రమే కనిపించనున్నాడని తెలుస్తోంది. సినిమా మొత్తం మీద ఆయన పాత్ర 15 నుండి 20 నిమిషాల మధ్య మాత్రమే ఉంటుందనీ అంటున్నారు. 'ఎవడు' సినిమాలో బన్నీ పాత్రలాగా 'వ్యూహం' సినిమాలో నానీ పాత్ర చాలా కీలకంగా నిలుస్తుందే కానీ హీరోగా మాత్రం కాదు అనేది తాజా సమాచారం. అయితే.. ఈ సినిమాకి దిల్ రాజుతో పాటు నానీ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడనే టాక్ మాత్రం వినపడుతోంది.దీనిపై మరింత చదవండి :