శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (10:44 IST)

వీరభద్రమ్ చౌదరి డైరెక్టన్ లో నరేష్ అగస్త్య దిల్ వాలా ప్రారంభం

Naresh Agastya, Shweta Awasthi
Naresh Agastya, Shweta Awasthi
పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలరా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం 'దిల్ వాలా'. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.
 
ఈ చిత్రంలో మెరిసే మెరిసే ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా నటిస్తున్నారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
 
తారాగణం: హీరో: నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి,  రాజేంద్ర ప్రసాద్, అలీ రాజా, దేవ్ గిల్ , అలీ పోసాని, బ్రహ్మజీ, రఘుబాబు, సుదర్శన్, భద్రం, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, మాణిక్, గోవిందరావు, గోవర్ధన్, ఎస్తార్, ప్రగతి, లయ, లహరి, హిమజ, శిరీష తదితరులు