శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (17:45 IST)

నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు

Naveen Polisetti
నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్'  సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా 'నవీన్ పోలిశెట్టి' ఈ చిత్రానికి కథానాయకుడు. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
 
సంక్రాంతి శుభాకాంక్షలు తో ఈ రోజు పేరుతో కూడిన ప్రచార చిత్రం విడుదలచేశారు చిత్ర బృందం. వీడియో ను నిశితంగా గమనిస్తే ‘ ఏదో పెళ్లికి సంభందించి ఏర్పాట్లు, హడావుడి గమనించవచ్చు. పెళ్ళికొడుకు తయారవుతున్న తీరు కనిపిస్తుంది. ఫోటో షూట్ జరుగుతూ ఉంటుంది..

 
చిత్ర కథానాయకుడు పాత్రధారి రాజు (నవీన్ పోలిశెట్టి) మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా...." నాయుడు గారు హనీమూన్ కి హవాయి కి టికెట్స్ బుక్ చేశారా లేదా...డబ్బులు గురించి ఆలోచించకండి రాజు గాడి పెళ్లి ఇక్కడ. హవా హవాయి అంటూ హమ్మింగ్ చేస్తూ డాన్సు చేస్తాడు. ఫోటోగ్రాఫర్ ను పిలుస్తూ రాజు గాడు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పగిలిపోవా లిరా... గ్లిట్టరింగ్, షివరింగ్, ఫ్లిక్కరింగ్ అంటూ ఫోజు లిస్తాడు.

 
పారిజాతం అత్తయ్యా.. రేయ్ అత్తయ్య గారు వచ్చారు ఎసిలు ఆన్  చేయండ్రా అంటూ తన బంగారాన్ని చూపిస్తూ స్టయిల్ కొడుతూ ఉంటాడు. ఇదేం విడ్డూరం ఆడవాళ్లకేన వడ్డాణం... అందుకే నేను కూడా మామ కు చెప్పి డబ్ల్యు డబ్ల్యు యఫ్ లాంటింది ఒక ఐదు కిలోల బంగారం చేయించాను. చూస్తావుగా పద. మన ఫోటోలు చూసి ఆ కత్రినా కైఫ్, విక్కి కౌషల్ కుళ్లుకుని చావాలరా అలా తియ్యి నువ్వు. దీనికి రాజు ఈటింగ్  కాజు అని కాప్షన్ ఏసు కో రా...!  ఉంగరాన్ని కింద పడేస్తూ యాక్షన్ చేస్తూ ఉంటాడు.


అంతలోనే.. ఒరేయ్.. రేయ్..రేయ్..అది చూసావా, ఆ బరువు కి పడిపోయిందిరా..ఎత్తకురా రేయ్..రేపు మళ్ళా కొనుక్కుందాం..రాజు గాడి పెళ్లిరా..మామ ఎంత ఖర్చు పెడతాడో కనపడాలరా ఫొటోలో...పైనుంచి కింద దాకా ఒక ఫుల్ లెంగ్త్ తియ్యరా .. ఈ చెప్పులు...అంటూ చెప్పులు చూసి కోపంతో...అరేయ్ అల్తాఫ్ ...ఫాంటసీ ఫుట్ వేర్ వేసుకుంటాను నేను..? రాజు గాడి పెళ్లి ఇది.. 7 తరాల పెళ్లి.. సారి అండి మీరు వచ్చేసారా...? ఇవన్నీ పట్టించుకోకండి...నేను చెప్పుకోకూడదు కానీ మోస్ట్ ఎంటర్ టైనింగ్ ఈవెంట్ ఆఫ్ ది డికేడ్ అండి. థియేటర్ లో మీరే చూస్తారుగా.
టైటిల్ ఏంటంటారా....?
 
అరేయ్ కళ్లజోడు...? ఒక భీభత్సమైన బ్యాగ్రౌండ్ స్కోర్ వేసుకోరా... "అనగనగ ఒక రాజు"
నేనిలా స్లో మోషన్ లో వుంటాను ....పెట్టుకోరా నన్ను.... అంటూ రాజు పాత్ర ధారి నవీన్ పోలిశెట్టి ఆద్యంతం నవ్వుల విందు చేస్తాడు ఈ ప్రచార చిత్రంలో. ప్రఖ్యాత సంగీత దర్శకుడు తమన్  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ ప్రచార చిత్రానికి ఆయన అందించిన నేపథ్య గీతం మరింత వన్నె తెచ్చింది.

 
ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటున్నారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. త్వరలోనే చిత్రం షూటింగ్  ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలను, విశేషాలను త్వరలోనే మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు.