సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (16:42 IST)

శ్రీకృష్ణ జన్మాష్టమికి న‌వీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రాబోతుంది

Naveen Polishetty, Anushka
Naveen Polishetty, Anushka
హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. సోమవారం ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు.
 
అనౌన్స్ మెంట్ నుంచి అందరిలో ఆసక్తి కలిగించింది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. స్టార్ హీరో ధనుష్ పాడిన హతవిధీ ఏందిది పాట, లేడీ లక్ సాంగ్ చార్ట్ బస్టర్స్ గా నిలిచి సినిమా మీద మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టిని స్క్రీన్ మీద చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ఉండటంతో సినిమా చూసేందుకు ఈ హాలీడేస్ ఆడియెన్స్ కు కలిసిరానున్నాయి.