సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (09:05 IST)

నవాజుద్దీన్ సిద్ధిఖీపై భార్య సంచలన ఆరోపణలు

Nawazuddin Siddiqui's wife, Aaliya
గత కొంతకాలంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన భార్య ఆలియా సిద్ధిఖీల మధ్య విడాకుల కేసు నడుస్తుంది. ఈ క్రమంలో నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆలియా సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడు రోజులుగా తనకు సరిగ్గా ఆహారం కూడా ఇవ్వడం లేదని, పడుకోవడానికి బెడ్, అలాగే, బాత్‌రూమ్‌కు వెళ్లనీయకుండా వేధిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
 
నవాజుద్దీన్ సిద్ధిఖీ‌, ఆయన కుటుంబ సభ్యులు అలియా సిద్ధిఖీని ఇంటి నుంచి పంపించేందుకు కుట్రలు చేస్తున్నారని, ఇందులోభాగంగా, ఆమెపై అక్రమాస్తుల నేరారోపణ నిందను కూడా మోపారని లాయర్ తెలిపారు. అలాగే,పోలీసులద్వారా ఆమెను అరెస్టు చేయిస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. 
 
ఈ విషయంలో పోలీసులు కూడా నవాజుద్దీన్ సిద్ధిఖీకే సహకరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, ఆలియాను ఇతరులెవ్వరూ కలవకుండా ఆమె చుట్టూ కట్టుదిట్టమైన భద్రతతో పాటు సీసీటీవీ కెమెరాలను కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారని తెలిపారు.