Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి 2 అద్భుతం. ప్రభాస్ నటన మరీ అద్భుతం.. బాలీవుడ్ సహజనటుడు సిద్ధీఖి ప్రశంసలు

హైదరాబాద్, సోమవారం, 29 మే 2017 (06:09 IST)

Widgets Magazine

విడుదలై అయిదో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ బాహుబలి 2 ప్రభంజనం తగ్గడం లేదు. అయిదోవారం కూడా సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయని సమాచారం. మరోవైపున సినిమాను ప్రశంసిస్తున్న ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ సహజ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి ఈ కోవలో చేరిపోయారు. బాహుబలి2 సినిమాపై కల్పించబడిన వాతావరణం ఎలా ఉందంటే సినిమా  చూడకుండా ఉండలేకపోయాననేశాడు. నిజంగానే బాహుబలి అద్భుతం. ప్రభాస్ నటన మరీ అద్భుతం అని ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు. గ్యాంగ్స్ ఆప్ వాసెపూర్, తలాష్, మాంజి వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన సహజనటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. 
baahubali
 
ఇప్పటికే రిషికపూర్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సుశాంత్ సింగ్, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు బాహుబలి2పై అభినందనలు తెలిపారు. బాహుబలి 2 ఇంకా దేశంలో, విదేశాల్లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నెలరోజుల్లో 300 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన బాహుబలి తమిళనాడులో రోబోను మించి అత్యధిక కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది. కేరళ చరిత్రలో అత్యధిక కలెక్షన్ల రికార్డు కూడా బాహుబలి 2 పేరుతో నమోదైంది.  
 
అయిదో వారంలో కూడా థియేటర్లలోకి జనాలను రప్పిస్తున్న చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1600 కోట్లు సాధించింది. నెలరోజుల తర్వాత కూడా మహానగరాల్లో మల్టీఫ్లెక్స్‌లలో, ఐమాక్స్ థియేటర్లలో ఇంకా హౌస్ పుల్ కలెక్షన్లు రాబడుతున్న అరుదైన చరిత్రకు బాహుబలి-2 సాక్షీభూతమై నిలుస్తోంది.
 
✔ @Nawazuddin_S
I had seen Bahubali 2 and the atmoshphere created in the film pulled me into it.
Prabhas's act was fantastic.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి2 సినిమాపై నా భయాన్ని మొత్తంగా పొగొట్టిన కాంప్లిమెంట్ అది: రాజమౌళి

బాహుబలి 2 సినిమాపై ఒక ఎన్నారై డాక్టర్ నుంచి వచ్చిన అభినందన జీవితకాలంలో మర్చిపోలేనని ...

news

బాలీవుడ్ ఖాన్‌లకు వయస్సు మీరుతోందా.. దూరం జరుగుతున్న కుర్ర హీరోయిన్‌లు

బాలీవుడ్‌ను పాతికేళ్లకు పైగా ఏలుతున్న ఖాన్‌ల త్రయానికి వయసు మీద పడుతోందా.. ఆ మాటంటే ...

news

ముంబైలో సాహో షూటింగ్ త్వరలో స్టార్ట్.... అటు ప్రభాస్ పెళ్లికి కూడా సంబంధం ఫిక్స్

'బాహుబలి' రెండు పార్టులకోసం దాదాపు ఐదేళ్ల సమయాన్ని వెచ్చించిన ప్రభాస్.. ఇప్పుడు 150 కోట్ల ...

news

దేవసేనకు భాగమతి చివరి సినిమానా? పెళ్లి వార్తలు నిజమేనా?

దర్శకుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలిలో కత్తి చేతబట్టి దేవసేన పాత్రలో ఒదిగిపోయింది. ...

Widgets Magazine