మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (11:59 IST)

అంగరంగ వైభవంగా నయన్ - విఘ్నేష్ వివాహం.. రజనీకాంత్ మాస్ ఎంట్రీ

nayanathara
అగ్ర హీరోయిన నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల వివాహం గురువారం ఉదయం చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురంలో జరిగింది. మహాబలిపురం ఈసీఆర్ రోడ్డులోని వడనెమ్మేలిలోని బీచ్ ఒడ్డున ఉన్న షెరటన్ గ్రాండ్ హోటల్‌లో అంగరంగం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. 
 
ముఖ్యంగా, సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ ఎంట్రీతో అదరగొట్టారు. అలాగే, బాలీవుడ్ అగ్రహీ
లో షారూక్ ఖాన్, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌తో అనేక మంది సినీ సెలబ్రిటీలు ఈ వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వహించారు. 
 
కాగా, నయనతార విఘ్నేష్ శివన్ పెళ్ళి వేడుకలను ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఏకంగా రూ.2.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వివాహ ఘట్టానికి సినిమా స్క్రిప్టు‌ను రూపొందించి రెండు ఎపిసోడ్‌లుగా టెలికాస్ట్ చేయనుంది. అందుకే ఈ వివాహానికి సంబంధించి ఒక్క ఫోటోను కూడా బయటకు లీక్ కాలేదు.