'సైరా నరసింహారెడ్డి' భార్య సిద్ధమ్మ టీజర్‌ను చూశారా...(Teaser)

nayantara
Last Updated: ఆదివారం, 18 నవంబరు 2018 (10:56 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. కె.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సందీప్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా, నయనతార పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్ధమ్మ వేషానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో అచ్చం నయన్ అచ్చం మహారాణి లుక్‌తో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కించారు. ఈ యాక్షన్ సీక్వెల్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని చిత్రబృదం అంటోంది. ఇందుకోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, అదిరిపోయే గ్రాఫిక్స్‌తో ఈ యుద్ధ సన్నివేశాలు ఒళ్లు గగురుపొడిచేలా ఉంటాయట. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.

దీనిపై మరింత చదవండి :