బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (18:28 IST)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

Nayanatara
నయనతార, ధనుష్‌ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ ధాన్ చిత్రంకు చెందిన బీటీఎస్ ఫుటేజీని ఉపయోగించడానికి ధనుష్ ఎన్ఓసీ ఇవ్వాలని డబ్బు డిమాండ్ చేశాడని నయనతార బహిరంగ లేఖ రాసింది. 
 
నయనతార తనపై బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ధనుష్ ఈ విషయంపై మౌనంగా ఉండిపోయాడు. ప్రస్తుతం నయన డాక్యుమెంటరీ విడుదలైంది. తాజాగా మరొక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది నయనతార.
 
ఆమె నటించిన వివిధ చిత్రాల నుండి ఫుటేజీని ఉపయోగించడానికి తనకు ఎన్ఓసీ ఇచ్చిన ప్రతి నిర్మాతకు ధన్యవాదాలు. లేఖలో, ఆమె షారూఖ్ ఖాన్, బాలచందర్ వంటి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయనిధి స్టాలిన్, కేఈ జ్ఞానవేల్ రాజా, ఏఆర్ మురుగదాస్, లైకా ప్రొడక్షన్స్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్‌లకు ధన్యాదాలు తెలిపింది.
 
మెగాస్టార్, మెగా పవర్ స్టార్ అంటూ చిరంజీవి, రామ్ చరణ్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించింది. సైరా నరసింహారెడ్డి ఫుటేజీని ఉపయోగించుకునేందుకు ఎన్‌ఓసీ ఇచ్చినందుకు మెగాస్టార్‌కు నయనతార  కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రెస్ నోట్ ద్వారా ఎన్ఓసీ ఇవ్వని ధనుష్‌ స్పందన కోసం నయనతార ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ ఆరోపణలపై రానున్న రోజుల్లో ధనుష్ స్పందిస్తాడో లేదో చూడాలి.