సినిమా బిజినెస్ చేస్తున్న నీతూ చంద్ర.. ప్రొడ్యూసర్‌‌గా ఓకే ఇక డైరక్టర్‌గా..?

Selvi| Last Updated: గురువారం, 3 డిశెంబరు 2015 (15:39 IST)
తెలుగులో గోదావరి.. సత్యమేవ జయతే సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన నీతుచంద్ర సినిమా బిజినెస్‌లో మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి బిజినెస్‌లో అడుగుపెట్టిన నీతూ చంద్ర నిర్మాతగా మరో సినిమాను రూపొందిస్తోంది. దీంతో నీతూ చంద్ర నిర్మాతగా నిలదొక్కుకున్నట్టేనని మంచి టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం నీతు చంద్ర నిర్మిస్తున్న సినిమా షూటింగ్ దశలోనే వుంది. గతంలో 'దేశ్వా' .. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ బీహార్' చిత్రాలను నిర్మించింది. ఈ సినిమాలతో నిర్మాతగా ఆమెకి అభినందనలు దక్కాయి. దాంతో ఆమె మరో సినిమాను ప్లాన్ చేసుకుంది. తన సోదరుడి దర్శకత్వంలో 'మిథిలియా మక్కాన్' సినిమాను నిర్మిస్తోంది.

ఇప్పటికే యూఎస్ .. కెనడా .. నేపాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, తాజా షెడ్యూల్ ను ముంబైలో జరుపుకోనుంది. ఈ సినిమా తనకి పేరుతో పాటు మంచి వసూళ్లను కూడా తెచ్చి పెడుతుందని నీతూ చంద్ర భావిస్తోంది. మరి నీతు సినిమా హిట్టవుతుందో లేదో వేచి చూడాలి.దీనిపై మరింత చదవండి :