Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేహా ధూపియాకు యాక్సిడెంట్... కాపాడటం మానేసి, సెల్ఫీలకు ఎగబడిన జనం!

శనివారం, 12 ఆగస్టు 2017 (11:29 IST)

Widgets Magazine
neha dhupia

టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన "పరమవీరచక్ర" చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి నేహా ధూపియా ఒకరు. ఈమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ విషయం ఆ ప్రాంత వాసులకు తెలియడంతో ఒక్కసారిగా జనం భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వీరంతా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించకుండా నటి నేహాతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చండీగఢ్‌లో ఓ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో నేహా ధూపియా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బ్రేకులు పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాకపోయినా, ఆమె కళ్లద్దాలు పగిలిపోయాయి. రోడ్డు మధ్యన ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో, రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 
కారులో ఉన్నవారికి సాయం చేయడానికి వెళ్లినవారు... అందులో ఉన్న నేహా ధూపియాను గుర్తు పట్టారు. అంతే... అక్కడున్న జనాలంతా ఆమె పరిస్థితిని పట్టించుకోకుండా, ఆమెతో సెల్ఫీలకు ఎగబడ్డారు. దీంతో ఆమె చాలా ఇబ్బందికి గురయింది. ఓ అర్థగంట సేపు వారికి సెల్పీలతో పాటు, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వేరే కారు రావడంతో... బతుకుజీవుడా అంటూ ఆమె ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సాయిపల్లవికి తెలివిలేదా?... క్రేజ్‌ను 'క్యాష్' చేసుకోవడం తెలియదట?

సాయిపల్లవి.. సాయిపల్లవి... ఇపుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న పేరు. దీనికి కారణం "ఫిదా" ...

news

నాకు చైతూకూ పెళ్లి ఎపుడో జరిగిపోయింది.. సమంత

తమ ప్రేమ వివాహంపై నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు ...

news

టార్చ్‌లైట్‌లో వేశ్యగా కనిపించనున్న సదా...

నితిన్, సదా, గోపీచంద్ కాంబినేషన్‌లో తేజ దర్శకత్వం వహించిన జయం సినిమా గుర్తుంది కదూ. ఈ ...

news

విడాకులిచ్చిన భర్త వద్దకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న నటి?

చిత్రపరిశ్రమ ఏదైనా.. నటీనటులు ఎవరైనా.. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం ఓ ...

Widgets Magazine