Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంఘమిత్రకు ఆ నటా.. వద్దే వద్దే బాబోయ్.. వణుకుతున్న నిర్మాత

హైదరాబాద్, శుక్రవారం, 9 జూన్ 2017 (05:31 IST)

Widgets Magazine

ఆ నటి అంటే ఆ దర్శకుడికి పిచ్చ పిచ్చ అభిమానం. ఇప్పటికే తనకు మూడు చిత్రాల్లో అవకాశం ఇచ్చారు. తన మాట కాదని, చెప్పింది చేస్తుందని ఆమె అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. తన తాజా చిత్రం సంఘమిత్రకు కథానాయకి సెట్‌ కావడంలేదు. చాలా కాలంగానే ఈ చిత్రంలో నాయకి కోసం అన్వేషణ జరిగింది. చివరికి క్రేజీ నటి శ్రుతీహాసన్‌ నటించడానికి అంగీకరించి, ఆ తరువాత వైదొలిగి షాక్‌ ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఆ దర్శకుడు తన ఆస్థాన నటి హన్సికను సంఘమిత్రలో యువరాణిని చేయాలని ఆశించారట.
hansika
అయితే వ్యాపారంలో మెలికలు తిరిగిన చిత్ర నిర్మాత, శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ అధినేత మురళి నటి హన్సికకు తమిళంలోనే కాదు తెలుగులోనూ మార్కెట్‌లేదని, అలాంటి నటిని సంఘమిత్రలో నాయకిగా ఎంపిక చేస్తే చిత్ర వ్యాపారం మొత్తం దెబ్బతింటుందని అన్నారట. దీంతో దర్శకుడు సుందర్‌.సీ సైలెంట్‌ అయ్యిపోయారట.
 
ఆ దర్శకుడు సి. సుందర్. ఆ నటి ఎవరంటే హన్సిక. తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన హన్సికకు ఈ మధ్య టైమ్‌ ఏమీ బాగోలేదు. కోలీవుడ్‌లో ఒక్క చిత్రం లేదంటే నమ్మండి. లోపం ఎక్కడుండి చిత్రాల ఎంపికలోనా ఏదేమైనా హన్సికను కోలీవుడ్‌ పూర్తిగా పక్కన పెట్టేసిందన్నది నిజం. టాలీవుడ్‌లోనే అమ్మడికి ఇదే పరిస్థితి. కాగా మాలీవుడ్‌లో మాత్రం ఒక చిత్రంలో నటిస్తోంది. నిర్మాత అడ్డు చెప్పడం కారణంగా సంఘమిత్ర వంటి పవర్‌పుల్ కేరక్టర్‌లో నటించే ఛాన్స్ తృటిలో కోల్పోయింది. 
 
కాగా సంఘమిత్రలో నటి నయనతార పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ  ఈ అగ్రనాయకిపైనా నిర్మాత మొగ్గు చూపలేదట. నయనతార నటించిన తిరునాళ్, డోరా వంటి చిత్రాలు అపజయం చెందడమే ఇందుకు కారణం మరి.కాగా ఏతా వాతా సంఘమిత్ర నాయకి బాలీవుడ్‌కు చెందిన బ్యూటీనే అయ్యే అవకాశం ఉందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. తమన్నానా? ఏమో.. వేచి చూడాల్సిందే మరి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దాసరికి నివాళులు చెప్పేందుకు శ్రీదేవికి రెమ్యూనరేషన్ కావాలా...?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండ్ దర్శకరత్న దాసరి నారాయణ రావు చనిపోతే ఆయనకు సంతాపం ...

news

నకిలీ నోట్ల చెలామణి కేసు : కన్నడ నటి అరెస్టు

నకిలీ నోట్ల చెలామణి కేసులో కన్నడ నటి జయమ్మని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ...

news

అక్కినేని వారి పెళ్లిపిలుపు : మా పెళ్లికి రండి అంటున్న నాగచైతన్య.. పెళ్లెప్పుడంటే...

అక్కినేని ఇంటి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్టోబర్ ఆరో తేదీన అక్కినేని నాగా చైతన్య, ...

news

ఆ దశకం హీరోయిన్లతో కలిసి చిరంజీవి ఏం చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనకు ఆయన ఒక్కరే ...

Widgets Magazine